Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత నెల రోజులకు పైగా హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరుగుతున్న వేసవి హాకీ శిక్షణ శిబిరం మంగళవారంతో ముగిసింది. ఈ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్ హాజరై శిక్షణ పొందిన విద్యార్థులను అభినందించి ధ్రువ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హాకీ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ మాజీ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, హాకీ క్లబ్ కార్యదర్శి బోడిగే తిరుపతి, ఉపాధ్యక్షులు భూసారపు శంకర్, సీనియర్ క్రీడాకారులు చింత శ్రీనివాస్, గుడ్డేలుగుల సమ్మయ్య, సజ్జు, యేముల రవికుమార్, సాధుల శ్యాం కుమార్, చౌడమళ్ళ రాజు, మాటూరి రాజేష్, కాయకంటి రాజేష్, గుడ్డేలగుల ప్రదీప్, పల్లపు సంబరాజు, మోటపోతుల వినయ్, కొండాల్ రెడ్డి, మల్లారెడ్డి, నీరటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

వేసవి శిక్షణ తర్వాత ధ్రువ పత్రాలతో విద్యార్థులు





