
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్రలే కీలకమని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూరాబాద్ లో సభ్యత్వ నమోదు, ఎస్ ఐఆర్ పై నాయకులతో సమన్వయ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గంలో పార్టీనీ మరింత బలోపేతం చేయాలన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడంలో ప్రతి నాయకులు తమ బాధ్యతగా భావించి పూర్తి చేయాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామాలు, వార్డుల స్థాయిలో విస్తృతంగా నిర్వహించి ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఎస్ ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా కృషి చేయాలని కోరారు. బూత్ స్థాయిలో బిఎల్ ఏలు చురుకుగా పనిచేసి ఓటరు జాబితాల సవరణ, పరిశీలన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సర్పంచ్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ అభ్యర్థులు, కౌన్సిలర్ అభ్యర్థులకు పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జూన్ 12న జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్ లో నిర్వహించనున్న సభకు మాజీ మంత్రి టి హరీష్ రావు కానున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సర్పంచ్లు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి






