Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ డివిజన్ లో ఎన్నికల సంఘం ఆదేశించిన ఎస్ ఐఆర్ కార్యక్రమంను అధికారులు, బిఎల్వోలు వేగవంతంగా చేయాలని హుజురాబాద్ ఆర్డిఓ జల కుమారి సూచించారు. బుధవారం హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో, రాజకీయ పార్టీల నాయకులతో ఎస్ ఐఆర్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జూన్ చివరి వారంలో ప్రారంభమైన ఎస్ఐఆర్ కార్యక్రమం హుజురాబాద్ డివిజన్ లోని అన్ని ప్రాంతాల్లో సంబంధిత బాధ్యులైన అధికారులు, బిఎల్ఓలు బిఎల్ ఏ లను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లాలని కోరారు. ప్రతి ప్రాంతంలో గణన ఫారాలు ప్రతి ఒక్క ఓటరుకు అందాలన్నారు. గణన ఫారాలు నింపే సమయంలో ఓటర్లకు వచ్చే సాధారణ సందేహాలను బిఎల్ఓ లు తీర్చాలని వారికి ఎలాంటి సందేహం ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లాలన్నారు. డివిజన్లోని అన్ని మండలాల తహసిల్దార్లు గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న పనులను పరిశీలించాలన్నారు. సామాన్య ప్రజలకు వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి అధికారులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు జక్కని నరేందర్, సురేష్, ఎస్ ఐఆర్ ఇన్చార్జి నరేందర్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.





