
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మునిసిపల్ కార్యవర్గ సమావేశం శనివారం మున్సిపల్ సమావేశ మందిరంలో జరగగా పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 35 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.

పట్టణములోని 30 వార్డులలో మురికి కాలువలు నిర్మాణం, సిసి రోడ్లు, కల్వర్టుల నిర్మాణం కొరకు సాధారణ నిధుల నుండి ఒక్కో వార్డుకు రెండు లక్షలు, వర్షాకాలంలో అవసరమైన ప్రాంతాలలో వరదనీరు నిల్వ ఉండకుండా చేయడానికి, గుండ్ల చెరువులో మురుగు నీరు కలవకుండా చేయుటకు 1,98,000 రూపాయల సాధారణ నిధులతో RCC పైపులు కొనుగోలు చేయుటకు, మిషన్ భగీరథ నల్లా నీరు వృధాకాకుండా నల్లాలకు బాల్ వాల్స్ అమర్చుటకు గాను 15వ ఆర్ధిక సంఘం నిధుల నుండి 5 లక్షల రూపాయలు ఖర్చు చేయుటకు, సాధారణ నిధుల లో 99,000 రూపాయలతో పట్టణములోని 14 , 24 వార్డులలో గల గ్రేవ్ యార్డును అభివృద్ధి చేయుటకు, పట్టణములో 1, 12, 13 ,15వ వార్డులలో DBM-16 కెనాల్ ప్రక్కన గల స్మశాన వాటిక నందు కనీస వసతులైన బోర్ వెల్, మోటారు పంపు సెట్, స్నానాల ఘాట్ చేయడానికి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి, కమిషనర్ బి కిషన్, కౌన్సిలర్లు, కార్యాలయ మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారి జి అభినవ్, సానిటరీ ఇన్స్పెక్టర్ డి కిరణ్, టి.పి.ఎస్ శ్రీకాంత్, ఏఈ దుస్త నరేష్, జూనియర్ అకౌంట్స్ అధికారి ఎస్ ఆర్తి, జూనియర్ అకౌంటెంట్ సి.హెచ్. గోపాల్ రెడ్డి, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ వినయ్, సిబ్బంది పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన అధికారులు ప్రజాప్రతినిధులు (కౌన్సిలర్లు)






