
—శ్రీరామదాసు భక్త మండలి వ్యవస్థాపద్యక్షులు రామదాసు తిరుపతి ఈవో కిదేవస్థాన అధికారులు
—ఈవో చేతులమీదుగా శ్రీరామదాసు భక్త మండలి వారి భద్రాద్రి రామయ్య కోటి గోటి తలంబ్రాల కార్యక్రమానికి అంకురార్పణ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట) జులై 5 : గత 11 సంవత్సరాలుగా శ్రీ రామదాసు భక్త మండలి చెల్పూర్ జయశంకర్ భూపాలపల్లి వారు కోటిగోటి తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం భక్తజనులకు విధితమే!
ప్రతి ఏడు లాగే 2027లో శ్రీరామ నవమి నాడు జరగబోయే భద్రాచల సీతారాముల కళ్యాణార్థమై శ్రీ రామదాసు భక్త మండలి వారు నిర్వహించే 11 వసంతాల కోటిగోటి తలంబ్రాల కార్యక్రమానికి ఈరోజు భద్రాచల సీతారాముల సన్నిధిలో ఆలయ వేద పండితుల సమక్షంలో భద్రాచల దేవస్థానం ఈవో చేతుల మీదుగా విత్తనపు వడ్ల పూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తుల కోలాహలంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగినదిఈ సందర్భంగా శ్రీరామదాసు భక్త మండలి వ్యవస్థాపద్యక్షులు రామదాసు తిరుపతి ఈవో కిదేవస్థాన అధికారులు పూజారులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో భాగంగా విత్తనపు వడ్ల పూజ మొదలు తలంబ్రాలుగా మలిచి దేవస్థానంలో అందించే వరకు గల కార్యక్రమాల వివరాలు అందించి వారి సహకారం కోరడం జరిగింది, ఈవో సానుకూలంగా స్పందిస్తూ హామీ ఇచ్చారు. దీనిలో తదితరులు పాల్గొన్నారు.








