
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం వారాహి దేవి మాతకు వేద పండితులు కిరణ్ కుమార్, అజిత్ కుమార్ లు సాంప్రదాయ బద్ధంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత రెండు రోజులుగా వారాహి మాత దీక్షలు తీసుకున్న పలువురు భక్తులు ప్రతిరోజు వారాహిమాతకు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కాగా శనివారం దేవాలయంలో వారాహిమాతకు శాస్త్రోక్తంగా అమ్మవారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యక్షులు కొత్త అశోకరెడ్డి -సరళ, దంపతులు, కోమల్ల విజేందర్ రెడ్డి- కోమల దంపతులు, రవీందర్ రెడ్డి, యాదగిరి పలువురు భక్తులు పాల్గొన్నారు.




అయ్యప్ప దేవాలయంలో వారాహిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పూజారులు, పాల్గొన్న భక్తులు..





