Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత అందుబాటులో తీసుకురావడం కోసమే హుజురాబాద్ పట్టణంలో నూతనంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను ప్రారంభిస్తున్నట్లు ఆ బ్యాంక్ జోనల్ హెడ్ ఎం పిచ్చయ్య తెలిపారు.

బుధవారం హుజూరాబాద్ పట్టణంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను ఆయన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా స్వదేశీ బ్యాంక్ అని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ బ్యాంకు మరిన్ని సేవలను అందించడానికి ముందుకు వస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో వరంగల్ రీజియన్ లో ఏర్పాటైన 44వ శాఖ హుజురాబాద్ బ్యాంక్ అని అన్నారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వి.సతీష్ కుమార్ మాట్లాడుతూ….బ్యాంకు ద్వారా ఈ ప్రాంత అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన రుణాలు అందించడం ద్వారా ప్రజల మన్నలను పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు రీజినల్ హెడ్ ఐ రాజ్ కుమార్, వ్యాపారవేత్త మల్లారెడ్డి, చీఫ్ మేనేజర్ షేక్ అబ్దుల్, బ్రాంచ్ మేనేజర్ మహేష్, సిబ్బంది, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.
:లోకల్ యాడ్స్:
–స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలుపుతున్నవారు: శ్రీ గోస్కుల వివేక్ గారు, పిఎసిఎస్ సెక్రటరీ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





