
మృతుని కుటుంబానికి స్నేహితుల చేయూత
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో గాయత్రి మార్బుల్ షాప్ నిర్వాహకుడు, ఆర్.ఎం.పి ఇప్పలపల్లి రవీందర్ నెల రోజుల క్రితం షాలపల్లి ఇంద్రనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆయన స్నేహితులు స్వచ్ఛందంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఎవరికి తోచినంత వారు ఆర్థిక సాయం చేయడంతో రూ. 1,20,500 పోగు చేసి అతని భార్య రేణుక పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి ఆమెకు బండ్ ను శనివారం అందజేశారు. మృతుడు రవీందర్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండడంతో వారి భవిష్యత్తు అవసరాల కోసం ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని ఆయన స్నేహితులు తెలిపారు. బాండును అందజేసిన వారిలో అతని స్నేహితులు టి రమేష్, శ్రీనివాస్ గోవర్ధన్, పరమేష్, జ్ఞానేశ్వర్, రాజారెడ్డి తదితరులు ఉన్నారు.
