
హుజురాబాద్ స్వర్ణోదయం ప్రతినిధి : హుజురాబాద్ పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో శనివారం ఆంజనేయ స్వామి భక్తులు చాలీసా పారాయణం నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవాలయ ఆవరణలో హనుమాన్ జయంతి వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలదారులు విద్యానంద్ ,సత్యం అంజి, తదితరులు పాల్గొన్నారు.
-హనుమాన్ భక్తులకు అన్నదానం

హుజురాబాద్ పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం ఆంజనేయ స్వామి భక్తులకు ఎదులాపురం వాకర్స్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతాప రమేష్ భూసారపు శంకర్, ప్రతాప శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.