
-తెలంగాణ రంగస్థల కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ విష్ణుదాస్ గోపాల్ రావు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
సినియర్ రంగస్థలం నటుడు, పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి(68) ఆకస్మిక మృతి కళరంగానికి తీరని లోటని తెలంగాణ రంగస్థల కళాకారుల సంగం గౌరవ అధ్యక్షుడు కల రవళి సోసియో కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విష్ణుదాస్ గోపాల్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న మరణించిన శ్రీనివాస్ రెడ్డి అంత్యక్రియలు వారి స్వ గ్రామము పెద్దపాపయ్య పల్లిలో శనివారము జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గోపాల్ రావు శ్రీనివాస్ రెడ్డి చేసిన శేవలను గుర్తు చేసుకొని కొనియాడారు. 50 మందిని రంగస్థల కళాకారులను తయారు చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాగ మయూరి సంస్థ అధ్యక్ష, కార్యదర్షులు వెంపటి సదానందం, మంచికట్ల రమేష్, కలరావలి సంస్థ ప్రచార కార్యదర్శి ఇంద్రకరణ్, నటులు ప్రభాకర్. బండ కిషన్ తదితరులు పాల్గొన్నారు.