
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రంగుల పండుగ హోళి పర్వదినంను శుక్రవారం హుజురాబాద్ డివిజన్లో ప్రజలు ఆనందోత్సాహల మధ్య జరుపుకున్నారు. హుజురాబాద్ పట్టణంలో శుక్రవారం చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా వివిధ రకాల రంగుల కుంకుమలను చేత పట్టుకొని తమ మిత్రులకు, సహ ఉద్యోగులకు, పరిచయస్తులకు రంగులు తల్లి హోలీ శుభాకాంక్షలు తెలుపుకొని ఆనందంగా పండుగ జరుపుకున్నారు. ముఖ్యంగా పిల్లలు తమ వయస్సు గల వారి ఇంటికి వెళ్లి రంగులు పూశారు. చిన్న పిల్లలయితే వాటర్ గన్లతో తమ స్నేహితుల మీద చల్లుకున్నారు. పట్టణంలో యువత వాహనాలపై తమ స్నేహితుల ఇళ్ల వద్దకు వెళ్లి రంగులు చల్లుకున్నారు కొంతమంది కోడిగుడ్లు తలపై కొట్టారు. మహిళలు యువతు లు సైతం తమ స్నేహితుల రాళ్ల వద్దకు వెళ్లి రంగులు పూసి ఆనందంగా పండుగ జరుపుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు ఉద్యోగులు జర్నలిస్టులు హోళి వేడుకల్లో పాల్గొన్నారు.










