మండల యాదగిరి, స్వర్ణోదయం పతినిధి హుజురాబాద్:
హైదరాబాదులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు సింగపూర్ లోని విఎస్ఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు లింగబత్తిని మల్లయ్య పాల్గొని ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు చేస్తున్న సామాజిక సేవ పై మాట్లాడి పరిశోధనాత్మక పత్రాన్ని సమర్పించారు. ప్రొఫెసర్ పల్లవి నేతృత్వంలో 17, 18 తేదీలలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం రావడంతో పాల్గొని పరిశోధనాత్మక పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రంలో ప్రభుత్వ పాలన శాస్త్రం, విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో జర్నలిజంను బోధిస్తున్నారు. రెండు రోజులుగా జరిగిన అంతర్జాతీయ సదస్సును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ప్రారంభించగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సీతారామరావు , రిజిస్టర్ ఏబీఎన్ రెడ్డి , అకాడమిక్ డైరెక్టర్ పుష్ప చక్రపాణి, డీన్ వడ్డానం శ్రీనివాస్, ఉస్మానియా ప్రొఫెసర్ పార్థసారథి ,సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటేశం, నాక్ మాజీ డైరెక్టర్ ఎస్.వి ప్రసాద్, చౌదరి దేవీలాల్ (హర్యానా) విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ప్రోఫెసర్ అజ్మీర సింగ్ మాలిక్, కలకత్తా విశ్వవిద్యాల ప్రొఫెసర్ దీపాంకర్ సినహతో పాటు దేశ విదేశాల నుండి వైస్ ఛాన్స్ లర్లు, ప్రొఫెసర్లు ,పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 100 కు పైగా పరిశోధక విద్యార్థులు పరిశోధనాత్మక పత్రాలను సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

