
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని ఏకలవ్య కాలనీలో తెలంగాణ ఎరుకల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కూతాడి కుమారస్వామి ఆధ్వర్యంలో ఎరుకల నాంచారమ్మ జాతర వాల్పోస్టర్ ను ఆదివారం విష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూతాడీ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ.. ఈనెల 23 గురువారం రోజున వైశాక శుద్ధ పౌర్ణమి నాడు ములుగు జిల్లాలోని రామాంజపురం గ్రామంలో ఎరుకల నాంచారమ్మ జాతరను రంగ రంగ వైభవంగా ఎరుకల కులస్తులు జరుపుతున్నారని తెలిపారు. ఈ జాతరకు నాలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. అలాగే ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎరుకల నాంచారమ్మ ఆలయాన్ని కొంతమంది అగ్రకులస్తులు ఓర్వలేక ధ్వంసం చేశారని, వెంటనే ప్రభుత్వం ఎరుకల నాంచారమ్మ ఆలయాన్ని పునర్నిర్మానం చేయాలన్నారు. ఎరుకల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా సంస్కృతిని కాపాడే దిశగా చొరవ చూపాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏకలవ్య కాలనీలోని ఎరుకల ప్రజలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
