కల్యాణలక్ష్మి స్కీమ్ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రూ.725 కోట్లను విడుదల చేసింది. ఈ పథకానికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులను కేటాయించింది కాంగ్రెస్ సర్కార్. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న కల్యాణలక్ష్మి అప్లికేషన్లను త్వరలోనే అధికారులు క్లీయర్ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కళ్యాణం చేసుకున్న యువతులకు లక్ష రూపాయల నగదు తో పాటు తులం బంగారం అందజేయనుండడంతో మహిళల్లో ఆనందం వెల్లువిరుస్తుంది.
