
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ డైరీ ఆస్తులను అక్రమ స్వాదీనాన్ని తీవ్రంగా ఖండిస్తునట్లు రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ ఆధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. ప్రైవేట్ డైరీలకు మేలు చేసేందుకు కరీంనగర్ పాల డైరీని విఛ్చిన్నానికి చేసే
ప్రభుత్వ పాలకుల అక్రమ నిర్ణయాన్ని నిరసిస్తూ డైరీ చైర్మన్ చలిమెడ రాజీశ్వర్ రావు ఆధ్వర్యంలో 5 వేల పాల రైతులతో కలిసి పద్మనగర్ నుంచి భారీ ర్యాలీ శాంతి యుతంగా పాద యాత్రగా కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం వరకు ఉమ్మడి జిల్లా పాడి రైతులు తరలి వచ్చి ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన కార్యక్రమంలో పోలాడి రామారావు పాల్గొని మాట్లాడారు.

1989కి ముందు కరీంనగర్ మిల్క్ ఫెడరేషన్ గా 11 ఎకరాలతో, చిన్న చిన్న మిషినరీలతో కొద్ది మంది ఉద్యోగులతో ప్రభుత్వ జోక్యంతో ఉండి 20వేల లీటర్ల పాల ఉత్పత్తితో కోటి 30 లక్షల నష్టాల బాటలో ఉండేదని రామారావు అన్నారు. 1989లో రైతుల బాగస్వామ్యంతో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ గా సొసైటీగా ఏర్పడి ప్రభుత్వ జోక్యం లేకుండా రైతుల బాగ స్వామ్యంతో పర్ డే కి 2లక్షల లీటర్లతో కొట్లాది రూపాయల ఆదాయంతో 3 వేల మంది ప్రత్యక్ష, మరో 30 వేల మంది పరోక్ష ఉద్యోగులతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నడుస్తుందన్నారు. వేలాది మంది ఉమ్మడి జిల్లా పాల రైతులకు మేలు జరుగుతుందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా దేవాలయాల్లో, పాటశాలల్లో కరీంనగర్ డైరీ నెయ్యి, పాలు సరఫరా చేస్తూ కొత్త మార్కెట్ ఉత్పత్తులను పెంచుకుంటూ లాభాల బాటలో నడుస్తుందన్నారు.

ప్రభుత్వ పెద్దల దుర్బుద్ధితో, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం దరణిలో 11 ఎకరాలు కరీంనగర్ డైరీ పేరు మీద ఉన్న దాన్ని ప్రభుత్వ అధికారులు తొలగించి కొత్తగా ఏర్పడిన భూ మాత పోర్టల్ లో 11ఎకరాలను అక్రమంగా నమోదు చేసి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈనెల 5వ తేదీన కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కరీంనగర్ డైరీ నుంచి పాత ఫెడరేషన్ కు మార్చారని పోలాడి రామారావు మండి పడ్డారు. ప్రభుత్వ పెద్దల రియల్ ఎస్టేట్ కొరకు మేలు చేసేందుకే, కరీంనగర్ డైరీని నాశనం చేసి, ప్రైవేట్ వాళ్లకు మేలు చేసేందుకే చేసిన ఇట్టి అక్రమ దివాలా కోరు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించు కోవాలని రామారావు డిమాండ్ చేశారు. లేకుంటే మూల్యం తప్పదని పోలాడి రామారావు హెచ్చరించారు. త్వరలో రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మందితో కలెక్టరేట్ ముట్టడిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు ప్రజా సంఘాల నాయకులు గన్ను నర్సింహారెడ్డి, ఆకారపు గౌతమ్ రెడ్డి, శంకరయ్య గౌడ్, కాల్వ వెంకట్, మహేష్, నరేష్, మల్లయ్య, వెంకటయ్య, తీగల లక్ష్మణ్ రావులతో పాటు ఉమ్మడి జిల్లా రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.





