
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో గ్యార్మి షరీఫ్ ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…మతసామరస్యానికి గ్యార్మి షరీఫ్ ఉత్సవాలు ప్రతీక అని, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మైనార్టీ సోదర సోదరీమణులకు ఈ సందర్భంగా ఆయన పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు బండ శ్రీనివాస్ (మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్), దిలీప్ (జమ్మికుంట మున్సిపల్ చైర్మన్), జావీద్ (జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్), సమ్రీన్ ఘఫర్ (కౌన్సిలర్), ఇమ్రాన్ (మాజీ కౌన్సిలర్), మల్లరెడ్డి (సర్పంచ్), తిరుపతి రెడ్డి (మాజీ ఎంపీపీ), అజ్జాద్ ఖాన్ మరియు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు, సోదరీమణులు, స్థానిక ప్రజలు హాజరై ఉత్సవాలను విజయవంతం చేశారు.





