
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణంలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు మంగళవారం అలీమ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ సాగాయి. పూలతో శోభాయమానంగా అలంకరించిన బండిపై ఊరేగింపుగా చాదర్లను తీసుకువచ్చి, పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సమర్పించారు.



ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రోంటాల సుహాసిని – మనోజ్ రావు దంపతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి సంపూర్ణంగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని అన్నారు.
ఈ వేడుకల్లో జామే మస్జిద్, ఈద్గా అండ్ ఖబరస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, సెక్రటరీ మహమ్మద్ అశ్వక్ (ఆశు)లతో పాటు కౌన్సిలర్లు మహమ్మద్ ఖాలీక్ హుస్సేన్, బి మొగిలి, ఈ సమ్మయ్య, ఎన్ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, పుణ్య-బాబు, కో-ఆప్షన్ సభ్యులు అలీమ్ తదితరులు పాల్గొన్నారు.





