Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరాం 20వ వర్ధంతిని పురస్కరించుకుని త్వరలో నిర్వహించనున్న “చలో వరంగల్ – బహుజన రాజ్యాధికార సమర భేరి” బహిరంగ సభ గోడ పోస్టర్‌ను హుజూరాబాద్‌లో శనివారం ఆవిష్కరించారు. BSP హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు గిన్నారపు మహేందర్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ పల్లె ప్రశాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ, బహుజన సమాజాన్ని చైతన్యపరిచి, వారికి రాజ్యాధికారం కల్పించడమే లక్ష్యంగా కాన్షీరాం తన జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి బహుజన కుటుంబానికి చేరవేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
వరంగల్‌లో జరగబోయే “సమర భేరి” సభను విజయవంతం చేసి బహుజనుల ఐక్యతను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో BSP జిల్లా ఉపాధ్యక్షుడు మంద సమ్మయ్య, నియోజకవర్గ ఇన్చార్జులు అంబాల ప్రభాకర్, వేల్పుల మల్లేష్, నాయకులు కండె తిరుపతి, రాం రాజేశ్వర్, రామ్ శ్రీనివాస్, ఎదునూరి రమేష్, అచ్యుత్, తునికి భాస్కర్, శ్రీకాంత్, రఘు తదితరులు పాల్గొన్నారు.

BSP హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు గిన్నారపు మహేందర్
##లోకల్ యాడ్స్##






