
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట పట్టణంలో పోస్ట్ మాస్టర్ గా సేవలందిస్తూ అలాగే అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఊకంటి మహేందర్ కు ఇటీవల కాలంలో శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ జాతీయ సాహితీ సంస్కృతిక సామాజిక సేవ సంస్థ వారు 2026 సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉద్యోగ సేవ రంగంలో అయిన కనబరిచిన అంకిత భావంతో సహచర ఉద్యోగులకు అందిస్తున్న మార్గదర్శకాన్ని గుర్తించి తెలుగు వెలుగు సాహితి వేదిక మహానంది జాతీయ పురస్కారం అవార్డును అందించడం జరిగింది.

ఈ సందర్భంగా పాత్రికేయులు మంద జగన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పాత్రికేయులు మంద జగన్ మాట్లాడుతూ ఊకంటి మహేందర్ కు జాతీయ మహానంది అవార్డు రావడం జమ్మికుంట పట్టణానికి గర్వకారణమని సందర్భంగా కొనియాడారు. రానున్న రోజుల్లో మరెన్నో పురస్కార అవార్డులతోపాటు ఉద్యోగ రంగంలో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు, పల్లవి రికార్డింగ్ స్టూడియో అధినేత మరముల్ల ప్రభు, జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ సందాని తదితరులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&






