
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ప్రస్తుత రిజర్వేషన్ల స్థానంలో అన్ని సామాజిక వర్గాల్లోని పేదలకు ఆర్ధిక స్థితి గతుల రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం రూపందించాలని ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి లు కోరారు.
బుధవారం హన్మకొండలో ఓసీ సమాఖ్య కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్ అధ్యక్షతన రాష్ట్ర, ఉమ్మడి జిల్లా నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.



ఏ సామాజిక వర్గానికి, మతానికి తాము వ్యతిరేకం కాదని కుల మతాలకతీతంగా అన్ని వర్గాల్లోని పేదలందరికి సమన్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమన్నారు.
ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీ లోని రాజ్ ఘాట్ నుంచి సామాజిక ఉద్యమ కారుడు ప్రవీణ్ ఆరోరా ఆధ్వర్యంలో చేపట్టిన దేశ వ్యాప్త బస్సు యాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి లు తెలిపారు.ఆర్ధిక ఆధారిత ఉద్యమానికి మద్దతుగా యాత్రలో తెలుగు రాష్ట్రాల్లోని ఓసీ ఐకాస ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
ప్రస్తుత రిజర్వేషన్ల అమలులో క్రిమిలేయర్ విధానం లేకపోవడం వల్ల రిజర్వేషన్ల ప్రయోజనాలు ఇప్పటికే పొందిన కుటుంబాలకే అవి పునరావృతమవుతున్న నేపథ్యంలో అర్హులైన ఇతర పేదలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
తమకు రిజర్వేషన్ల లో అన్యాయం జరుగుతుందని మరింతగా విస్తరించాలనే డిమాండ్ల తోకొన్ని వర్గాలు పోరాటం చేస్తున్న సందర్బంగా 50 శాతంకు పైగా రిజర్వేషన్లు కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయాన్నారు. దీని వల్ల ప్రతిభావంతులకు అవకాశాలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఓసీ ల్లోని ఆర్ధికంగా వెనుక బడిన వారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేంద్రం కల్పించిన తరహాలో అన్ని వర్గాల్లోని పేదలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఆర్ధిక స్థితి గతుల ఆధారంగా రిజర్వేషన్ల విధానాన్ని రూపొం దించాలని కోరారు.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ద కమిషన్ ఏర్పాటు చేసి అన్ని వర్గాల ఆర్థిక స్థితి గతులపై సమగ్ర అధ్యయనం చేయాలని వారు సూచించారు.
అవసరమైతే రాజ్యాంగ సవరణ కై పార్లమెంట్ లో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి లు విజ్ఞప్తి చేశారు. ఇదే సమావేశం లో ఇటీవల రవీంద్ర బారతిలో రాష్ట్ర లలిత కళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుక బడిన పేదల సంక్షేమానికి రాష్ట్ర ఓసి జేఏసీ ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్ చేస్తున్నా విశేష కృషికి గాను సమాజ సేవా సామ్రాట్ బిరుదు పొందిన సందర్బంగా ఓసి జేఏసీ రాష్ట్ర కమిటీ తరపున దుబ్బా శ్రీనివాస్ కు శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చందుపట్ల నర్సింహారెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షులు అర్జుల కిషన్ రెడ్డి, నాయకులు నల్లా రాజిరెడ్డి, గంగిడి ప్రభాకర్ రెడ్డి, కోరళ్ల విద్యాసాగర్ రెడ్డి, భోంపెల్లి రంగారావు, కంది రవీందర్ రెడ్డి, గౌతంశర్మ తదితర రాష్ట్ర, ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.
##లోకల్ యాడ్స్##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శ్రీ సిరిపాటి వేణు గారు, బేడ బుడగ జంగం, జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హుజురాబాద్ కరీంనగర్ జిల్లా.





