
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : తెలంగాణ మజ్దూర్ యూనియన్ హుజురాబాద్ డిపో గౌరవాధ్యక్షుడిగా నాగార్జున డైరీ అధినేత పుల్లూరి ప్రభాకర్ రావును కార్మిక నాయకులు ఏకగ్రీవంగా నియమించుకున్నారు. బుధవారం హుజరాబాద్ బస్ డిపో వద్ద ఆయనను కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కార్మికుల సంక్షేమం కోసం తాను కృషి చేస్తానని అన్నారు. కార్మికుల ప్రయోజనాలకు భంగం వాటిల్లినప్పుడు తాను వారికి అండగా ఉండి, సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.


ఈ కార్యక్రమంలో టీఎంయూ యూనియన్ గ్యారేజీ రీజినల్ కార్యదర్శి సాదుల కిషోర్, డిపో కార్యదర్శి టిఎస్ సింగ్, అధ్యక్షులు జి శ్రీనివాస్ రెడ్డి, ఎంప్లాయిస్ యూనియన్ డిపో అధ్యక్షులు ఎం రమేష్, సిహెచ్ రమేష్, జేఏసీ గ్యారేజీ కార్యదర్శులు కె చక్రపాణి, ఏ శ్రీనివాస్, టి శ్రీనివాస్, కే అశోక్ బాబు, ఏవీ రాజం, ఎన్ రవి, టి మహేష్, ఏవి భాస్కర్, ఆర్ కిషన్, పీఎస్ రెడ్డి, బీజేలాల్ మహిళా కార్యదర్శి సుమలత, పిబి లక్ష్మి, స్రవంతి, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శ్రీ సిరిపాటి వేణు గారు, బేడ బుడగ జంగం, జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హుజురాబాద్ కరీంనగర్ జిల్లా.





