
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలంలోని 16 గ్రామాలకు టీబి రహిత గ్రామాలుగా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించి గురువారం జిల్లా కేంద్రంలో ఆయా గ్రామాల సర్పంచులకు అవార్డులను అధికారులు అందించారని హుజురాబాద్ ఎంపీడీవో తూర్పాటి సునీత తెలిపారు. హుజురాబాద్ మండలంలోని సింగపూర్, చిన్న పాపయ్యపల్లి, పెద్దపాపయ్యపల్లి, ధర్మరాజుపల్లి గ్రామాలకు రజత పతకాలు, 12 గ్రామాలకు కాంస్య పతకాలు లభించాయి.

ఈ కార్యక్రమంలో అధికారులకు, సర్పంచులకు డిపిఓ జగదీశ్వర్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజగోపాల్ రావు డిటిసిఓ డాక్టర్ హిమబిందు, పత్తి అనిత (వెంకట్రావు పల్లి) మంతెన సుమలత (పోతిరెడ్డి పేట), మోలుగు సంధ్యారాణి (కనుగులగిద్ద ), ఇమ్మడి దయాకర్ (అంబేద్కర్ నగర్), భాషబోయిన శ్రీనివాస్ (బొత్తలపల్లి)చల్లూరి చిరంజీవి(చిన్నపాపయ్య పల్లి), కందల శ్రీలత (ధర్మ రాజుపల్లి),కోడిగుటి కిరణ్( శాలపల్లి- ఇందిరానగర్), వెలుపుల విజయ (మాందాడిపల్లి) తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ గూడూరి అంజలి – గౌతమ్ రెడ్డిగారు, వైస్ చైర్పర్సన్ (8వ వార్డు కౌన్సిలర్) పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.





