
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని రెండు అంగన్ వాడి కేంద్రాలలో, మున్సిపల్ పరిధిలోని సాయిబాబా గుడి సమీపంలోని ఒకటి, మూడు కేంద్రాలు, ఇప్పల నర్సింగాపూర్ లోని అంగన్వాడి కేంద్రంలో 9వ పోషణ అభియాన్ ముగింపు కార్యక్రమంలో భాగంగా గురువారం గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు కౌన్సిలర్లు సొల్లు సునీత, దామెర అనూష , పడారి సుమలతలు నిర్వహించారు.


ఈ సందర్భంగా హుజురాబాద్ బస్తీ దవాఖాన వైద్యాధికారిణి డాక్టర్ జరీనా, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమ్యరెడ్డిలు మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు సరైన పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల తమకే కాకుండా పుట్టబోయే పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం ఉంటుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో లభించే పోషకాహారాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందాలన్నారు. అనంతరం మూడు అంగన్వాడీ కేంద్రాలలో అన్నప్రాసన, సామూహిక శ్రీమంతాలు, పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమంలు .నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు రమ్య రెడ్డి, జ్యోతి, అంగన్వాడీ టీచర్ ప్రతాప జయ, జ్యోతి రాణి, అరుణ, పద్మ, సులోచన, సౌజన్య, ఆయాలు, తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ గూడూరి అంజలి – గౌతమ్ రెడ్డిగారు, వైస్ చైర్ పర్సన్ (8వ వార్డు కౌన్సిలర్) పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. హుజురాబాద్





