పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్

-వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝు

స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్: ఈ నెల 27వ తారీఖున నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో (వరంగల్, హనుమకొండ, జనగామ )144 సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేసారు. వరంగల్ , ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను ఈ నెల 27 తేది ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందన్నారు. ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల చుట్టూ గుమిగూడరాదని పోలింగ్ కేంద్రం నుండి 200 మీటర్ల హద్దును దాటి ఓటర్లు తప్ప ఎవ్వరు లోపలికి రాకూడదని సూచించారు. కావున కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ఈ విషయం పైన దృష్టి సారించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎవరైనా ఈ నియమ నిబంధనలను పాటించకుండా ఇబ్బందులకు గురిచేస్తే అట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!