
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ రామానుజ స్వామి వారి దివ్య ఆశీస్సులతో మన హుజురాబాద్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో పుష్యమి నక్షత్ర రోజున అనగా తేదీ 31/05/2025 శనివారం రోజున ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు స్వర్ణ అమృత ప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించడానికి హుజురాబాద్ వికాస తరంగిణి నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ స్వర్ణామృత ప్రాసన గుళికలు ఆరు నెలల పిల్లల నుండి 16 సంవత్సరాల పిల్లలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ఆయుర్వేదిక గుళికలతో పిల్లల మానసిక సామర్థ్యాలు, జీర్ణశక్తి నీ మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుందనీ, చర్మానికి నిగారింపును ఇస్తుందనీ, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది, మేధాశక్తిని పెంచుతుంది, శరీర క్రియలను వేగవంతం చేస్తుంది, మాటలు ఆలస్యంగా వస్తున్న పిల్లలకు సహాయపడుతుంది, గ్రహదోషాలను దూరం చేస్తుంది, అతి ప్రవృత్తి గల పిల్లలను నియంత్రిస్తుంది, ఆటిజం ను ఎదుర్కొనే శక్తిని ఇస్తుందన్నారు. ఈ గుళికలు కుల మత భేదాలతో సంబంధం లేకుండా ప్రతినెల మన హుజురాబాద్ లోని శ్రీ సీత రామచంద్రస్వామి వారి ఆలయంలో పుష్యమి నక్షత్రం రోజున ఉదయము ఏడు గంటల నుండి 10 గంటల మధ్యన ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ గుళికలను వేసుకోవడానికి అరగంట ముందు మరియు అరగంట తర్వాత ఏమి తినకుండా ఉండవలెననీ, కావున హుజురాబాద్ పట్టణ ప్రజలు, పిల్లల ఆరు నెలల నుండి 16 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ఈ మహత్తర కార్యక్రమంను సద్వినియోగం చేసుకొని తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై ముందుకు రావాలని కోరుకుంటున్నామన్నారు.
పుష్యమి నక్షత్రం నాడు చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు తద్వారా అన్ని మూలికల యొక్క ఔషధ విలువల శక్తి పెరుగుతాయనీ ఇది ఔషధ శక్తిని పెంచుతుందనీ మరియు రోగనిరోధక శక్తిని మరియు పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుని అందువల్ల ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున ఈ యొక్క ఔషధాన్ని అన్ని వికాస తరంగిణి కేంద్రాల్లో మరియు ఉమ్మడి వరంగల్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారి సౌజన్యంతో హుజురాబాద్ వికాస తరంగిణి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధరాచారులు, వికాస తరంగిణి హుజురాబాద్ శాఖ సభ్యులు యతిపతి అరుణ్ కుమార్, డాక్టర్ దివిటీ అంజనీదేవి, చిదురాల శ్రీనివాస్, చెరుకుపల్లి శ్రీవాణి, యతిపతి నిరంజన్ కుమార్, అక్కినపల్లి శ్రవణ్, దాసి కుమారస్వామి, చల్లూరి శ్రీధర్ పాల్గొన్నారు.







