-ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్:
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఏనుగు రాకేష రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ 62వ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థించారు. అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చిందని అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమాను తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రవీందర్ రావులు పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో ఇతర హుజూరాబాద్ టిఆర్ఎస్ పార్టీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.