
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1988–89 ఎస్సెస్సీ బ్యాచ్ చెందిన విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం అలరించింది. పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ఉన్నత పాఠశాలలో 1988–89 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 37 ఏళ్ల తరువాత ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. ప్రస్తుతం ఎక్కడెక్కడో స్థిరపడ్డవారు పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరయ్యారు. అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలు కలియ తిరుగుతూ అనాడు చేసిన అల్లరిని నెమరు వేసుకున్నారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. తమతోపాటు చదువుకుని మృతి చెందిన తమ బాల్యమిత్రుల ఆత్మశాంతి కోసం కొద్ది సేపు మౌనం పాటించారు. ఈ సందర్బంగా తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులను సన్మానించుకున్నారు. తోటి మిత్రలతో పోటాపోటీగా సెల్పీలు తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం బడిలో చేసిన అల్లరిని, మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. సాయంత్రి వీడ్కోలు చెప్పుకుంటూ ప్రతీ సంవత్సరం కార్యక్రమం నిర్వహించుకుంటామని, సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విద్యార్థులు తెలిపారు.

పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1988–89 ఎస్సెస్సీ బ్యాచ్




