
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజూరాబాద్ పట్టణాభివృద్ధిలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 9వ వార్డు దమ్మక్కపేటలో స్మశానవాటిక నూతన కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఆమె కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన (భూమి పూజ) చేశారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ సుహాసిని మాట్లాడుతూ… దమ్మక్కపేటతో పాటు బోర్నపల్లి, కొత్తపల్లి, ఇప్పల నర్సింగపూర్ గ్రామాల్లో స్మశానవాటికల కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి మొత్తం రూ. 44 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పట్టణంలోని ప్రతి వార్డునూ సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
అనంతరం 9వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు ఆఫీస్‌ను చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ ఇల్లందుల సమ్మయ్యను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన అతిధులుగా విచ్చేసిన కౌన్సిలర్లను, పార్టీ పెద్దలను శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమాల్లో కౌన్సిలర్లు సమ్మయ్య, సొల్లు సునీత, తాళ్లపల్లి రమేష్, బోరగాల మొగిలి, మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, జున్నోజు భాస్కర్, కో-ఆప్షన్ సభ్యుడు గొట్టే జమదగ్ని, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ నవీన్, సంద మల్ల బాబు, మాజీ కౌన్సిలర్ కొండాల్ రెడ్డి, కాంట్రాక్టర్ సుధాకర్, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ బండ వెన్నెల నవీన్ గారు 16వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.




