
—అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 130 మంది సిబ్బందితో విన్యాసం
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో భద్రతా సన్నద్ధతను అంచనా వేసేందుకు OCTOPUS (ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్) బృందం ఆధ్వర్యంలో శుక్రవారం ఆపరేషనల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. OCTOPUS ఎకో SWAT టీమ్ SOC/DSP బి. మరియ దాసు నాయకత్వంలో వివిధ శాఖల సమన్వయంతో ఈ విన్యాసం చేపట్టారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ పోలీస్, అగ్నిమాపక శాఖ, CSG, తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ (TGSPF), ట్రాఫిక్ పోలీస్, వైద్య బృందం, బాంబ్ డిస్పోజల్ (BD) బృందాలు పాల్గొన్నాయి. సచివాలయంలో అనుకోని భద్రతాపరమైన ముప్పులు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ భద్రతా, అత్యవసర సేవల విభాగాల సంసిద్ధత, పరస్పర సమన్వయం, స్పందనా సామర్థ్యం, కార్యాచరణ సామర్థ్యాలను అంచనా వేయడం, మరింత బలోపేతం చేయడం ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.


–130 మంది సిబ్బందితో విన్యాసం
ఈ మాక్ డ్రిల్‌లో వివిధ శాఖలకు చెందిన మొత్తం 130 మంది సిబ్బంది పాల్గొన్నారు.
##లోకల్ యాడ్స్##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ బండ వెన్నెల నవీన్ గారు 16వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.




