
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు శనివారం హుజూరాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి చైర్పర్సన్ రొoటాల సుహాసిని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాలకవర్గం అధికారులతో కలిసి
జాతీయ సమైఖ్యత దినోత్సవ (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి కిషన్, వార్డు కౌన్సిలర్లు, కొ-ఆప్షన్ సభ్యులు, మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి , సానిటరీ ఇన్స్పెక్టర్ డి. కిరణ్ , సీనియర్ సహాయకులు జె. వాణీ , జూనియర్ అకౌంటెంట్ సి.హెచ్. గోపాల్ రెడ్డి, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ పాలు వినయ్ , సానిటరీ జవాన్ ప్రతాప రాజు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
హుజురాబాద్ గ్రంథాలయంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి వేడుకలు

హుజురాబాద్ పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా గ్రంథాలయ కృషీవలుడు తిరునగరి రమేష్, గ్రంథాలయ అధికారిని విప్ప పద్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వల్లభాయ్ పటేల్ చిత్రపటాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశానికి చేసిన సేవలు భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటాయని ఈ సందర్భంగా అతని సేవలను కొనియాడినారు . భారత స్వాతంత్ర ఉద్యమంలో తన చిన్ననాటనే పాల్గొని గొప్ప స్వాతంత్ర సమరయోధునిగా దేశభక్తిని చాటుకొనడమే కాకుండా దేశ స్వాతంత్ర్యం కొరకు తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పేర్కొన్నారు. భారత దేశానికి స్వాతంత్రము సిద్ధించిన తరువాత భారత ఉప ప్రధానిగా హోం శాఖను నిర్వహిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాల రూపంలో ముక్కలుగా విడిపోయి చిన్నాభిన్నంగా ఉన్నటువంటి దేశాన్ని ఇండియన్ యూనియన్ గా తీర్చిదిద్దడానికి ఆనాడు ఉన్నటువంటి 560 సంస్థానాలను హైదరాబాద్ తో పాటు భారతదేశంలో తన ఉక్కు సంకల్పంతో విలీనం చేసినటువంటి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. అతని సేవలను గుర్తించి భారత ప్రభుత్వము 1991వ సంవత్సరంలో భారతరత్న అవార్డును ప్రకటించడమే కాకుండా గుజరాత్ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతి గొప్ప నైనా స్టాచు అఫ్ నేషన్ నిర్మించడంతోపాటు అతని జన్మదినాన్ని జాతీయ ఐక్యత దినంగా ప్రకటించడం అతని యొక్క గొప్పతనానికి నిదర్శనమని అభిప్రాయపడినారు . సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను ఆదర్శంగా తీసుకొని రేపటి భావి భారత పౌరులను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్క భారతీయుడు దేశభక్తిని చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఉపాధ్యక్షుడు కొలిపాక క్రాంతి కుమార్, తాటిపాముల కనకయ్య, దొంత హరికిషన్, గంగిశెట్టి జగదీశ్వర్, గాజర్ల బుచ్చిరాజం ,శ్రీపాద వెంకటేష్, జి వెంకటయ్య, జె అనిల్, కొలిపాక రంగయ్య, ఎం జ్యోతి, బుర్రి శేఖర్, జె సత్యనారాయణ, గాదె శ్రీనివాస్, చీకోటి రమేష్, కే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




