
-రూ. 3 లక్షల ఆస్తి నష్టం
స్వర్ణోదయం ప్రతినిధి, సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ కోళ్ల ఫాంకు విద్యుత్ అంతరాయం ఏర్పడి వెయ్యి కోళ్లు మృతి చెందాయి.
సద్ది రాజిరెడ్డి అనే వ్యక్తికి చెందిన పౌల్ట్రీ ఫామ్లో శుక్రవారం విద్యుత్ ఏకదాటిగా 4 గంటలు స్తంభించడంతో అందులో ఉన్న కోళ్లు వేడికి తట్టుకోలేక వెయ్యికి పైగా చనిపోయి సూమారు రూ.300000 నష్టం జరిగింది. ఎక్కడ కూడా కరెంటు కోతలు లేవని చెప్పే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారు చూడాలి మరి.. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేదొకటి చేసేది ఒకటి అనడానికి ఇదే నిదర్శనం.