
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజరాబాద్:
హుజురాబాద్ పట్టణానికి చెందిన మన సురక్ష హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ విద్యాసాగర్ హాకీ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డిస్ట్రిక్ట్ హాకీ వైస్ ప్రెసిడెంట్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ ప్రెసిడెంట్ కలిపాక శ్రీనివాస్, సెక్రటరీ గంగిషెట్టి ఉమామహేశ్వర్ లు హాజరై మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. హాకీ క్రీడాకారులకు క్రీడా పరికరాలు క్రీడా దుస్తులను అందజేసి ఉదార స్వభావాన్ని ప్రదర్శించిన డాక్టర్ విద్యాసాగర్ ను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు గుడెల్గుల సమ్మయ్య, వర్ధినేని రవీందర్ రావు, బి శంకర్, యూసఫ్, సజ్జు, రమేష్, కోచ్ టీ.శ్రీనివాస్, రాజేశ్, ఏం విక్రమ్, ఏం వినయ్, సన్నీ తదితరులు పాల్గొని దాతకు, అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.

Good Job