
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బోర్నపల్లి గ్రామానికి చెందిన గంట రవికుమార్ తల్లి ఇటీవల మృతి చెందగా విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రావుల రాజలింగారెడ్డి, లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి సలీం, గ్రామ నాయకులు గంట కొమురయ్య, తదితర నాయకులు ఉన్నారు.
