
సల్లంగా చూడాలని బీరన్నకు కి మొక్కలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
సల్లంగా చూడు బీరన్న.. అంటూ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ బోనం ఎత్తుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇల్లందకుంట మండలంలోని మల్యాల, లక్ష్మాజపల్లి గ్రామాలలో బీరన్న ఉత్సవాలలో భాగంగా వందలాది మంది మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకుని డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ బీరన్నకు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రణవ్ కు స్థానికులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో కులదేవతల పండుగలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అని, గ్రామ దేవతలను పూజించడం వల్ల గ్రామంలోని ప్రజలు సుఖశాంతులతో ఉండటంతో పాటు పాడిపంటలు సమృద్ధిగా ఉండి ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం అన్నారు. గ్రామ దేవతల ఉత్సవాలు జరపడం మంచి సాంప్రదాయమని పేర్కొన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు ఉన్నారు.
