Oplus_16908288
—పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్న నూతన సూపరింటెండెంట్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్ 21: హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నూతన ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా సీనియర్ వైద్యులు డాక్టర్ వాసుదేవరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్) డాక్టర్ కృష్ణప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం డాక్టర్ వాసుదేవరెడ్డి శనివారం ఆసుపత్రిలో ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య బృందం మరియు సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఇన్చార్జి సూపరింటెండెంట్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం డాక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన డీసీహెచ్ కృష్ణప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఆసుపత్రికి మరింత మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రసాద్, పి శ్రీకాంత్‌రెడ్డితో పాటు ఆసుపత్రి నర్సింగ్ అధికారులు, పారామెడికల్ మరియు ఇతర వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.




