
–పాల్గొన్న కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు హుజురాబాద్ పట్టణంలో వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా పట్టణంలోని 5వ వార్డులో లబ్ధిదారురాలు అపరాధ పూర్ణిమ నూతనంగా నిర్మించుకోనున్న ఇందిరమ్మ ఇంటికి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు ముఖ్య అతిథిగా హాజరై ముగ్గు పోసి, నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ సుహాసిని మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. లబ్ధిదారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సొల్లు సునీత, ప్రతాప తార, సంబంధిత వార్డు ఆఫీసర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, 5వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ పారుపల్లి కొండల్ రెడ్డి గారు, బిజెపి మండల అధ్యక్షుడు హుజురాబాద్.




