
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అత్యంత ప్రమాదకర పురుగుమందుల వినియోగాన్ని నిర్మూలించి, సురక్షిత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు ఫర్టిలైజర్ డీలర్లు కీలక పాత్ర పోషించాలని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉత్తమ పత్తి యాజమాన్య పథకం (నవక్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ) ఆధ్వర్యంలో, బీసీఐ క్లస్టర్ కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డి నేతృత్వంలో హుజురాబాద్లో ఫర్టిలైజర్ డీలర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు.

ప్రమాదకర మందులకు స్వస్తి: మోనోక్రోటోఫాస్, లాంబ్డా, బైఫెంత్రిన్ వంటి అత్యంత ప్రమాదకర పురుగుమందుల విక్రయాలను తగ్గించి, వాటి నిర్మూలనకు డీలర్లు సహకరించాలని బీసీఐ ప్రతినిధులు కోరారు.
జీవ నియంత్రణ & రక్షణ: రసాయనాలకు బదులుగా ట్రైకోడెర్మా, బవేరియా వంటి జీవ నియంత్రణ పద్ధతులను రైతులకు పరిచయం చేయాలని, పిచికారీ సమయంలో రైతులు తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు.
మట్టి పరీక్షలు తప్పనిసరి: రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడకుండా, మట్టి పరీక్షల ఫలితాల ఆధారంగానే అవసరమైన ఎరువులు వాడేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) ఛత్రు నాయక్ మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం నేల, పర్యావరణ పరిరక్షణ ఎంతో అవసరమన్నారు. ఏడీఏ సునీత మాట్లాడుతూ డీలర్లు ప్రమాదకర పురుగుమందులను ప్రోత్సహించవద్దని స్పష్టం చేశారు. కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. వెంకటేశ్వరరావు నేల, పంట, రైతుల ఆరోగ్య పరిరక్షణలో డీలర్ల బాధ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్, ఎల్కతుర్తి, సైదాపూర్, చిగురుమామిడి, భీమదేవరపల్లి మండలాలకు చెందిన 50 మంది ఫర్టిలైజర్ డీలర్లు, ఏఈఓలు, వ్యవసాయ అధికారులు, బీసీఐ ప్రతినిధులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ పారుపల్లి కొండల్ రెడ్డి గారు, బిజెపి మండల అధ్యక్షుడు హుజురాబాద్.




