
స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన
ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ ని విమర్శిస్తే ఎంతటి వారైనా ఊరుకునే ప్రసక్తే లేదు అని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ…
జమ్మికుంటలో జరిగిన ప్రెస్ మీట్ కు బల్మూర్ వెంకట్ కి ఎలాంటి సంబంధం లేకున్నా కొంతమంది నాయకులు బల్మూరిపై ఆరోపణలు చేయడము సరి కాదనీ అన్నారు. 2021 ఉప ఎన్నికల్లో హుజరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన, ఎన్నో గ్రామాలు తిరిగి పార్టీ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఎన్నో కుటుంబాలను పరామర్శించి , హుజురాబాద్ ప్రాంత ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అని అన్నారు. అలాంటి నాయకుని పైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన అన్నారు.