
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
ఆంజనేయస్వామి జయంతిని పురస్కరించుకుని ముందస్తుగా హుజురాబాద్ పట్టణంలో నెల్లి రామచంద్రం ఆధ్వర్యంలో అంజన్న మాల దారూలకు మంగళవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జూన్ 1వ తేదీన అంజన్న పెద్ద జయంతి పురస్కరించుకొని జమ్మికుంటరోడ్ లో అంజన్న భక్తులతో కలిసి ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ చాలీసాను భక్తులు పటించారు, విద్యానంద్, సత్యం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అనంతరం అంజన్న భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనిల్, అశోక్, నూన రమేష్, నెల్లి కవిత, అజయ్ లు పాల్గొన్నారు.





