
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం గావించారు. అనంతరం ఆయన భార్య శాలిని కూతురు శ్రీనిక తో కలిసి మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో, ఆరోగ్యంతో సుఖశాంతులతో ఉండాలని ఆ అరుణచేలేశ్వరస్వామి వారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

