
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు వచ్చేనెల జూన్ 2 నుంచి పెరగనున్నాయి.
ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీలను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపును వాయిదా వేయాలని ఎన్హెచ్ఏఐని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఎన్నికలు ముగియడంతో జూన్ 2 నుంచి టోల్ ఛార్జీలను సగటున 5శాతం పెంచి వసూలు చేయను న్నారు. దీంతో మధ్యతరగతి ప్రజలు టోల్ ట్యాక్స్ పెంచడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.