
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
క్రీడల్లో శిక్షణ తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారని పలువూరు వక్తలు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నెలరోజుల పాటు జరిగిన హాకీ క్రీడాకారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమం ముగిసింది. వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన బాల బాలికలకు సర్టిఫికెట్ల ప్రధానం చేశారు. కోచ్ ను సీనియర్ క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హాకీ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ ఉపాధ్యక్షులు భూసారపు శంకర్, ప్రధాన కార్యదర్శి గనిశెట్టి ఉమామహేశ్వర్, కౌన్సిలర్, కబడ్డీ క్రీడాకారుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.