
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి కానుండడంతో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని, ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు నాయకులకు పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. శనివారం హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ మొదలై అమరవీరుల స్థూపం వద్ద అమరవీలకు పెద్ద ఎత్తున నివాళులు అర్పించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఆదివారం బీఆర్ఎస్ కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్ని కార్యక్రమాలను ఉద్దేశించి తెలంగాణ తొలి సీఎం కెసిఆర్ ప్రసంగించనున్నారని ఆయన అన్నారు. దీంతోపాటు మూడో తేదీన అన్ని జిల్లాల్లో సామాజిక కార్యక్రమాలతో పాటు జెండావిష్కరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. దశాబ్ది ఉత్సవాలను నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరారు.
