
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రాము అరుణపతాకాన్ని ఎగుర వేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… స్వాతంత్ర పోరాట కాలంలోనే ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని, స్వాతంత్రం కోసం ఉద్యమాలు చేపట్టిందన్నారు.
పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటై విద్యా పరిరక్షణకై, శాస్త్రీయ విద్య, కామన్ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 89 సంవత్సరాలుగా విద్యార్థుల శ్రేయస్సు కోసం ఏఐఎస్ఎఫ్ పోరాటం చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాంపేల్లి రోహిత్, మండల నాయకులు గణేష్, శ్రీకాంత్, మణికంఠ, రవి, కిరణ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.


ఏఐఎస్ఎఫ్ జెండా ఎగురవేసి, నినాదాలు చేస్తున్న ఆ సంఘం నాయకులు…





