
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రముఖ కవి, రచయిత, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురై మరణించడం పట్ల తెలంగాణ సామాజిక రచయితల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పసుల స్వామి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హనుమకొండలో జన్మించి, కాకతీయ విశ్వ విద్యాలయంలో చదువుకుని, అదే యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేసి, ఉద్యోగ విరమణ పొంది కాలోజి నారాయణరావు స్ఫూర్తితో తన రచనలు ప్రారంభించారు. ఈమె కవిత్వం, కథ, వ్యాస, గేయ మొదలగు ప్రక్రియలలో రచనలు చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. దాశరధి, సి నారాయణరెడ్డి, కాళోజి నారాయణరావు వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ మలిదశ పోరాటంలో జయశంకర్ మార్గదర్శకత్వంలో ఆమె చురుగ్గా పనిచేశారు. ఇప్పటివరకు ఆమె 13 పుస్తకాలను ముద్రించడం జరిగింది. ఆమె మరణం తెలంగాణ సాహిత్య రంగానికి తీరని లోటుగా ఆయన అభివర్ణించారు.

అనిశెట్టి రజిత(ఫైల్)





