
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం గొల్లపల్లి గ్రామంలో గల బండి సమ్మయ్య అనే వ్యక్తి ఇంట్లో రాత్రి చోరీ జరిగింది.
హుజురాబాద్ మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన బండి సమ్మయ్య గత నెల రోజుల క్రితం నుండి కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేసుకొని చికిత్స పొందుతున్నాడు. ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంటిలో ఎవరూ లేరని భావించిన దొంగలు ఇంటిలో చొరబడి 18 తులాల వెండితో పాటు మూడు గ్రాముల బంగారం, 8 వేల రూపాయల నగదును చోరీ చేసినట్లు బాధితురాలు సమ్మక్క తెలిపింది. ఇంటికి వేసిన తాళాలు సైతం పగలగొట్టి ఎత్తుకొని వెళ్లారని పక్కింటి వారు సమాచారం ఇస్తే ఇంటికి వచ్చి చూడడం జరిగిందని పేర్కొన్నారు. సంఘటన స్థలానికి బ్లూ కోల్డ్స్ పోలీసులు చేరుకొని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చోరీ జరిగిన రైతు బండి సమ్మయ్య ఇల్లు…

బీరువాలో దాచిన వస్తువులు చంద్రవందల చేసి వెండి, బంగారం, నగదు దోచుకెళ్లిన దృశ్యం..

చోరీ జరిగిన ఇల్లును పరిశీలిస్తున్న బ్లూ కోల్డ్స్ పోలీసులు….





