Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కిమ్స్ డిగ్రీ, పీజీ కళాశాల B.Sc, M.Sc ఫుడ్ సైన్స్ విద్యార్థులు బుధవారం రోజు హుజురాబాద్ లోని నాగార్జున మిల్క్ డైరీని సందర్శించారని కిమ్స్ విద్య సంస్థల వైస్ చైర్మన్ పెరియాల సాకేత్ రామారావు తెలుపుతూ ఫుడ్ సైన్స్ విద్యార్థులకు ఇలాంటి క్షేత్ర సందర్శనలు చాలా ముఖ్యం అని, ఈ క్షేత్ర సందర్శనల వళ్ళ విద్యార్థులు పూర్తి స్థాయిలో విషయ పరిజ్ఞానం నేర్చుకుంటారని తెలియజేశారు. ఈ సందర్శనలో విద్యార్థులకు డైరీ AGM అవునూరి సుధాకర్, మేనేజర్ శ్రీనివాస్, డైరీ యొక్క శాస్త్ర సాంకేతిక విధానాలను స్వచ్చంధ ప్రమాణాలను ఉత్పత్తి అయ్యే పాల పదార్థాలు ఏ విధంగా తయారు చేస్తారని ప్రత్యక్షంగా వివరించారు. డైరీ సందర్శనకి అవకాశం కలిపించిన డైరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు, డైరెక్టర్ పుల్లూరి గణేష్ రావుకి విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్శనలో కిమ్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపాల్ అర్జున్ రావు, విభాగాధిపతి ఎన్.మహేష్, అధ్యాపకులు అంజలి, లయ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.






