
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గ్రామాలలో ఉన్న నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని హుజురాబాద్ ఎంఈఓ భూపతి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్యలు పిలుపునిచ్చారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నవభారత్ సాక్షరతా కార్యక్రమం (ఉల్లాస్) మండల స్థాయి శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో హుజురాబాద్ మండలంలోని రూరల్, అర్బన్ పరిధిలోని గ్రామ పంచాయతీ, వార్డు VOA/SLF లకు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్పి తిరుపతి, ఏపీఎం జ్యోతి, సిఎల్ఆర్పి మల్లీశ్వరి, రిసోర్స్ పర్సన్స్ పి శ్రీనివాస్, అల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





