Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఐఏ జాబితాలో మంత్రి శ్రీదర్ బాబుకి అరుదైన గౌరవం దక్కడం పట్ల జిల్లా కాంగ్రెస్ మైనారిటీ నేత ఎండి ఇమ్రాన్ హర్షం వ్యక్తం చేశారు. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకటించిన జాబితాలో శ్రీధర్ బాబు పేరు ఏడవ స్థానంలో ఉందని భారత్ ను ఐఏ రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్న వారికి ఇందులో చోటు కల్పించారని ఇమ్రాన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలలో ఎనలేని ఆదరణ పొందుతుందని దీనికి ఉదాహరణ మంత్రికి 100 మోస్ట్ ఇన్ ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఐ ఏ జబితాలో చోటు లభించడమే నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం మానుకొని ప్రజా ప్రభుత్వానికి సహకరించి ప్రజల సంక్షేమానికి పాటుపడాలని ఇమ్రాన్ సూచించారు.







