
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం జూపాక గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్నటువంటి ఇల్లందుల విజయ అనే కార్మికురాలు (ఎంపీ డబ్ల్యూ ) వర్కర్ గా విధులు నిర్వహిస్తుండగా అకారణంగా తొలగించినందున వెంటనే విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆమె ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ లో అడ్మిట్ అయి, డ్యూటీ లోకిహాజరు కానందున, పంచాయతీ కార్యదర్శి పాలకవర్గంతో కుమ్మక్కై ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వకుండా అకారణంగా కార్మికురాలని తొలగించి గత మూడు నెలలుగా తన పనిని తాను చేయించు కొకుండా అడ్డు పడుతూ బ్రతిమిలాడి కాళ్ళు మొక్కించుకున్న కూడా విధుల్లోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ మీద జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని, ఆ కారణంగా కార్మికురాలుని తొలగించిన వీరిపై చర్యలు తీసుకోవాలని ధర్నా అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ తెలిపారు.


జూపాక గ్రామపంచాయతీ వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం మాట్లాడుతున్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కే శంకర్..
జూపాక గ్రామపంచాయతీలో గత మూడు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకుండా కార్యదర్శి డబ్బులు వాడుకుని, ప్రతిసారి లేటుగా వేతనాలు ఇస్తున్నాడని కార్మికులు ఆరోపించారు. జీతాలు చెల్లించాలని అడిగిన కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నాడని పాలకవర్గంతో కుమ్మక్కై, అక్రమ తొలగింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. అలాగే గ్రామపంచాయతీలో బీనామీ పేర్ల మీద మల్టీపర్పస్ వర్కర్ గా పనులు చేయించుకుంటూ, ఒక్కరికి వచ్చిన వేతనం ఇద్దరికీ పంచి ఇస్తున్నారు, ఇది నిబంధనలకు విరుద్ధం కదా! అని ప్రశ్నంచారు.
ఇల్లందుల విజయ, మామ, ఇల్లంధులు కొమురయ్య 30సం!!లు గ్రామా పంచాయతిలో పనిచేసాడు, అతని తండ్రి 20 సంవత్సరాలు, గ్రామపంచాయతీలో అతి తక్కువ వేతనాలకు పనిచేసి సేవలందించారని, ఇప్పుడు కొత్తగా కార్మికులను ఆన్లైన్లో పేరు లేకుండా పనిచేయించుకోవడం తరతరాల నుండి పనిచేసిన కార్మికురాలు అన్యాయం చేయడం సరైనది కాదని అన్నారు. దీని మీద దశలవారీగా, సీఐటీయూ ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికైనా పాలకవర్గం అంతర్గత రాజకీయ వేభేదాలు పక్కన పెట్టి, వారి ఆధిపత్యం కోసం కార్మికుల పైన అజమాయిషి చేయడం సరైనది కాదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ హుజురాబాద్ మండల అధ్యక్షులు ఆకునూరి సుధాకర్, జిల్లా కమిటీ సభ్యులు అడెపు అరవింద్, మండల ఉపాధ్యక్షులు గుగ్గిళ్ళ రాములు, కార్మికులు కొమురయ్య, విజయ, సంపత్, తదితరులు పాల్గొన్నారు.





